బెజ్జంకి, వెలుగు: అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని పట్టుకున్నట్ల ఎస్ఐ కృష్ణారెడ్డి తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని తలరివాని పల్లె గ్రామ శివారు ప్రాంతంలోని సురేశ్ ఇంట్లో 100 క్వింటాళ్ల రేషన్ బియ్యం నిల్వ ఉంచినట్లు సమాచారం తెలిసింది.
వెంటనే టాస్క్ ఫోర్స్, బెజ్జంకి పోలీసులు ఆదివారం రాత్రి సోదా చేసి బియ్యాన్ని సీజ్చేశారు. పట్టుబడిన రైస్ ను సివిల్ సప్లై అధికారులకు అప్పగించి నరేశ్ పై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.