టీఎస్ఎల్పీఆర్బీ వెబ్ సైట్ లో.. ఎస్సై ప్రిలిమ్స్ కీ

టీఎస్ఎల్పీఆర్బీ వెబ్ సైట్ లో.. ఎస్సై ప్రిలిమ్స్ కీ

గతవారం (ఆగస్టు 7న) జరిగిన ఎస్సై ప్రిలిమ్స్ పరీక్షకు సంబంధించిన ‘కీ’ని తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు విడుదల చేసింది. WWW.TSLPRB.IN వెబ్ సైట్ లోకి వెళ్లి పరీక్ష కీని డౌన్ లోడ్ చేసుకోవచ్చని తెలిపింది. పరీక్ష కీ విషయంలో అభ్యర్థులకు ఏవైనా సందేహాలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని కోరింది. 

రేపు సాయంత్రం 5 గంటలలోగా తమ వెబ్ సైట్లో అభ్యర్థులు ఫిర్యాదులను సమర్పించవచ్చని సూచించింది. అభ్యంతరాలను స్వీకరించిన తర్వాత మరో వారంలోగా తుది కీని విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. సెప్టెంబరులో ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాలను విడుదల చేసే చాన్స్ ఉంది. కాగా, రాష్ట్రంలో మొత్తం 554 ఎస్సై పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడగా 2,47,217 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఒక్కో పోస్టుకు 446 మంది పోటీ పడుతున్నారు.