ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ పరీక్ష ఫలితాలు రిలీజ్

ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ పరీక్ష ఫలితాలు రిలీజ్

రాష్ట్రంలో ఎస్‌ఐ, కానిస్టేబుల్ ప్రాథమిక పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి.ఇవాళ పోలీస్‌ రిక్రూట్‌మెంట్ బోర్డు ఫలితాలను ప్రకటించింది. ఎస్‌ఐ, కానిస్టేబుల్, ట్రాన్స్‌పోర్టు కానిస్టేబుల్స్, ప్రొహిబిషన్‌, ఎక్సైజ్ కానిస్టేబుల్స్‌ ప్రాథమిక పరీక్షల ఫలితాలను విడుదల చేసినట్లు బోర్డు వెల్లడించింది. 554 ఎస్‌ఐ పోస్టులకు ఆగస్టు 7వ తేదీన రాత పరీక్ష నిర్వహించారు. 15,644 కానిస్టేబుల్, 63 ట్రాన్స్‌పోర్టు కానిస్టేబుల్‌, 614 ప్రొహిబిషన్, ఎక్సైజ్ కానిస్టేబుల్స్ పోస్టులకు ఆగస్టు 28న రాత పరీక్ష నిర్వహించారు. 

ఈ ఫలితాల్లో సివిల్‌ ఎస్సై ప్రిలిమినరీ పరీక్షలో 46.80 శాతం, సివిల్‌ కానిస్టేబుల్‌ ప్రాథమిక పరీక్షలో 31.40 శాతం, రవాణా కానిస్టేబుల్‌ పరీక్షలో 44.84 శాతం, ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌ పరీక్షలో 43.65 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ నిర్వహించిన ఈ రాత పరీక్షల కటాఫ్‌ మార్కులను ప్రభుత్వం సవరించింది. 200 మార్కులకుగాను 60 మార్కులు ఓసీలకు, 50 బీసీలు, ఎస్సీ, ఎస్టీలకు 40 మార్కులు ఉంటాయని ప్రభుత్వం ప్రకటించింది.