
కర్ణాటక సీఎం సీటు పంచాయతీ కొలిక్కి రావడం లేదు. రేసులో సిద్దరామయ్య, డీకే శివకుమార్ పోటీపడుతుండటంతో అధిష్టానం ఎటూ తేల్చుకోలేకపోతోంది. మే 14న సీఎల్పీ మీటింగ్ జరిగినా అభ్యర్థిని ఎంపిక చేయలేదు. బంతి ఢిల్లీ కోర్టుకు చేరింది. ఇపుడు హైకమాండ్ సీఎంఎంపికపై సందిగ్ధంలో పడింది. అధిష్టానం ఎవరి వైపు మొగ్గుచూపుతుందా అనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే సిద్ధరామయ్య ఢిల్లీకి చేరుకున్నారు. మరి డీకే శివకుమార్ వెళ్తారా లేదా అన్నది తెలియాల్సి ఉంది. సీఎం ఎంపికపై ఏర్పాటు చేసిన ఏఐసీసీ అబ్జర్వేషన్ కమిటీ కూడా ఢిల్లీకి వెళ్లింది.
నన్ను నమ్మి 135 సీట్లిచ్చారు
డీకే శివకుమార్ ఇవాళ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్బంగా మాట్లాడిన ఆయన కర్ణాటక ప్రజలు తనను నమ్మి 135 సీట్లు ఇచ్చారని ఇంతకు మించి ఏం గిఫ్ట్ ఉంటుందన్నారు. పార్టీ హైకమాండ్ తనకు పుట్టిన రోజు గిఫ్ట్ ఏమిస్తుందో తెల్వదన్నారు.
సూర్జేవాలతో ముగిసిన డీకే మీటింగ్
రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ రణదీప్ సూర్జేవాలతో డీకే శివకుమార్ భేటీ ముగిసింది. దాదాపు3 గంట పాటు చర్చలు జరిపారు. ఈ సందర్భంగా తాను కాంగ్రెస్ కు ఎంతో చేశానని ఇస్తే సీఎం పదవి ఇవ్వాలని సూర్జేవాలతో డీకే చెప్పినట్లు తెలుస్తోంది. సీఎం పదవి ఇవ్వకుంటే అసలు కేబినెట్ ల పదవి వద్దని చెప్పినట్లు సమాచారం.