
బెంగళూరు: కర్నాటక సీఎం సిద్ధరామయ్యకు చెందిన టయోటా ఫార్చ్యునర్ కారుపై ఏడు ట్రాఫిక్ ఉల్లంఘన చలాన్లు పడ్డాయి. వీటిలో ఆరుసార్లు సీఎం ముందు సీటులో సీటు బెల్ట్ ధరించకపోవడం, ఒకసారి ఓవర్ స్పీడ్ చలాన్లు ఉన్నాయి. ఇవి 2024 జనవరి నుంచి ఇంటెలిజెంట్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ కెమెరాల్లో రికార్డయ్యాయి.
ప్రస్తుతం కర్నాటక ప్రభుత్వం ప్రకటించిన 50% డిస్కౌంట్ స్కీమ్‌ను ఉపయోగించి, సీఎంవో రూ.2,500 జరిమానా చెల్లించింది. ఈ స్కీమ్ సెప్టెంబరు 19 వరకు అమల్లో ఉంది. 2024లో బెంగళూరులో 80 లక్షలకు పైగా ట్రాఫిక్ ఉల్లంఘన కేసులు నమోదయ్యాయి, వీటిలో ఎక్కువగా ద్విచక్ర వాహనదారులవే ఉన్నాయి. ఈ డిస్కౌంట్ పథకం ద్వారా ఇప్పటి వరకు రూ.40 కోట్లు వసూలయ్యాయి.