సిద్దిపేట, వెలుగు : తన భార్యను వార్డు సభ్యురాలిగా గెలిపించుకునేందుకు ఓ భర్త మంచి ఆఫర్ ప్రకటించాడు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రఘోత్తంపల్లి గ్రామ ఆరో వార్డు సభ్యురాలిగా శ్రీవాణి పోటీ చేస్తోంది. ఈ వార్డులో మొత్తం 145 మంది ఓటర్లు ఉండగా.. ఇందులో 65 మంది పురుషులు ఉన్నారు. దీంతో వారి ఓట్లు రాబట్టుకునేందుకు శ్రీవాణి భర్త శ్రీకాంత్ వినూత్న ఆలోచన చేశాడు. తన భార్యకు ఓటు వేసి గెలిపిస్తే ఐదేండ్ల పాటు వార్డులోని మగవారందరికీ ఫ్రీగా కటింగ్, షేవింగ్ చేస్తానని ప్రకటించాడు. గెలిచిన తర్వాత మహిళా ఓటర్ల కోసం కూడా మరో ఆఫర్ ప్రకటిస్తానని హామీ ఇచ్చాడు.
