తొగుట (దౌల్తాబాద్), వెలుగు: రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొని ఒకరు చనిపోగా, మరొకరికి తీవ్ర గాయాలైన ఘటన సిద్దిపేట జిల్లాలో సోమవారం జరిగింది. దౌల్తాబాద్ ఎస్సై అరుణ్ కుమార్ వివరాల ప్రకారం.. మెదక్ జిల్లా చేగుంట మండలం ఇబ్రహీంపూర్ గ్రామానికి చెందిన ఈద లాలయ్య(60) సోమవారం బైక్‌పై దౌల్తాబాద్ మండల కేంద్రానికి వచ్చాడు.
పని ముగించుకొని తిరిగి ఇంటికి వెళ్తుండగా, దౌల్తాబాద్ మండలం కోనాయిపల్లి గ్రామ శివారులోని లాలయ్య బైకును రామయంపేట వైపు నుంచి వస్తున్న ఓ బైక్ ఎదురుగా లాలయ్య బైకును ఢీకొట్టిండు. ఈ ప్రమాదంలో లాలయ్యకు తలకు, కుడికాలికి తీవ్ర గాయాలయ్యాయి.
స్థానికులు కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం అందించారు. గాయపడిన లాలయ్యను ప్రైవేట్ వాహనంలో గజ్వేల్ హాస్పిటల్‌కు తరలించగా.. చికిత్స పొందుతూ చనిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు .
