Telusu Kada: సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ సినిమాకు ‘U/A’ సర్టిఫికెట్.. సినిమా ఎవరు చూడాలో ‘తెలుసు కదా’?

Telusu Kada: సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ సినిమాకు ‘U/A’ సర్టిఫికెట్.. సినిమా ఎవరు చూడాలో ‘తెలుసు కదా’?

యూత్ ఐకానిక్ హీరో సిద్దు జొన్నలగడ్డ అప్ కమింగ్ రిలీజ్ మూవీ ‘తెలుసు కదా’. ప్రముఖ స్టైలిస్ట్  నీరజ కోన ఈ చిత్రంతో దర్శకురాలిగా పరిచయం అవుతోంది. రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్స్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌‌‌‌‌‌‌‌పై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించారు. దీపావళి కానుకగా అక్టోబర్ 17న సినిమా విడుదలవుతోంది.

ఈ సందర్భంగా ‘తెలుసు కదా’ మూవీ సెన్సార్ కంప్లీట్ చేసుకుంది. ఈ విషయాన్ని మేకర్స్ పోస్టర్ రిలీజ్ చేస్తూ వివరాలు వెల్లడించారు. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు ‘U/A’ సర్టిఫికెట్ జారీ చేసింది. సెన్సార్ రిపోర్ట్ ప్రకారం, ఎక్కడా కట్స్ లేకుండా సినిమా రన్‌టైమ్ దాదాపు 2 గంటల 16 నిమిషాలుగా ఉందని సమాచారం. 

రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌లో, క్రేజీ స్టోరీని డైరెక్టర్ డిస్క్స్ చేయబోతున్నట్లు సెన్సార్ నుంచి పాజిటివ్ రిపోర్ట్స్ వస్తున్నాయి. సిద్ధు, రాశీ ఖన్నా మరియు శ్రీనిధి శెట్టిల నటన ఈ చిత్రానికి మూలస్తంభాలు అని టాక్. సిద్ధు వచ్చే ప్రతి సీన్ కామెడీతో, లవ్ రొమాంటిక్ యాంగిల్లో అద్భుతంగా ఉంటుందని సెన్సార్ నుంచి వినిపిస్తుంది. అలాగే ఎస్ ఎస్ థమన్ సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, నీరజ కోన స్టైలిస్ట్‌‌‌‌గా వర్క్, డైరెక్షన్ రెండు విభాగాల్లో తన మార్క్ చూపించినట్లుగా సమాచారం. 

ఇప్పటివరకు రిలీజైన టీజర్, గ్లింప్స్ ఆసక్తి రేకిత్తించేలా ఉన్నాయి. ఇద్దరు హీరోయిన్స్‌‌తో సిద్ధూ లవ్ ట్రాక్ నడుపుతూ టిపికల్ క్యారెక్టర్‌‌‌‌ పోషించినట్లుగా ఉంది. సిద్ధుతో పాటు రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి  మోడరన్ లుక్స్‌‌లో ఇంప్రెస్ చేసేలా ఉన్నారు. మొత్తానికి సిద్దు హిట్ కొడితే.. చూడాలని ఆయన ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. జాట్ మూవీతో దెబ్బతిన్న సిద్దు.. ఎలాంటి హిట్ కొడుతాడో చూడాలి మరి. 

'U/A' సర్టిఫికేట్: ఎవరైనా  దీన్ని చూడవచ్చు.. కాకపోతే 12 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు ఈ చిత్రాన్ని వారి తల్లిదండ్రులతో కలిసొ లేదా పెద్దల తోడుతో చూడాలని సూచిస్తారు. ఈ సర్టిఫికేట్ పొందిన సినిమాల్లో హింసాత్మక యాక్షన్ సన్నివేశాలు,  కొంతవరకు నగ్నత్వం ఉంటుంది.