నాణ్యత ప్రమాణాలతో పనులు పూర్తి చేయాలి : కలెక్టర్హైమావతి

నాణ్యత ప్రమాణాలతో పనులు పూర్తి చేయాలి : కలెక్టర్హైమావతి

సిద్దిపేట రూరల్, వెలుగు: పనుల జాతర కార్యక్రమంలో భాగంగా ప్రారంభించిన పనులను నాణ్యత ప్రమాణాలతో పూర్తిచేయాలని కలెక్టర్​హైమావతి సూచించారు. శుక్రవారం సిద్దిపేట కలెక్టరేట్ లో వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఎంజీఎన్ఆర్ఈజీఎస్ కింద జిల్లాలో వివిధ గ్రామాల్లో జీపీ భవనాలు, అంగన్వాడీ సెంటర్, కమ్యూనిటీ శానిటరీ క్యాంప్లెక్స్ నిర్మాణాలకు స్థలం కోసం ఆయా మండలాల తహసీల్దార్లతో చర్చించి అందుకు కావలసిన స్థలాన్ని సేకరించుకోవాలన్నారు. వనమహోత్సవ లక్షాన్ని వంద శాతం పూర్తి చేసినందుకు అభినందించారు.

ఇందిరమ్మ ఇళ్ల పురోగతి గూర్చి ఎంపీడీవో లతో మాట్లాడుతూ వంద శాతం గ్రౌండింగ్ అవ్వాలని, కట్టుకోడానికి సుముఖంగా లేనివారిని తొలగించి అర్హులైన లబ్ధిదారులకి ఇవ్వాలన్నారు.  అడిషనల్​కలెక్టర్​గరిమ అగర్వాల్, జడ్పీ సీఈవో రమేశ్, డీఆర్డీవో జయదేవ్ ఆర్య, డీఎంహెచ్​వో ధనరాజ్, లక్ష్మీ కాంత్ రెడ్డి పాల్గొన్నారు.

ఓటర్ జాబితాపై సందేహాలు ఉంటేఅప్లికేషన్ పెట్టుకోవాలి

ఓటర్ జాబితాపై సందేహాలు ఉంటే అప్లికేషన్ పెట్టుకోవాలని కలెక్టర్ హైమావతి సూచించారు. గ్రామపంచాయతీ ఎన్నికల సన్నాహాల్లో భాగంగా జిల్లాలో గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీ ప్రతినిధులతో అడిషనల్ కలెక్టర్ అబ్దుల్ హమీద్ తో కలిసి సమావేశం నిర్వహించారు. జిల్లాలో 508 జీపీల్లో 4508 పోలింగ్ స్టేషన్లలో 6,55,958 ఓటర్లు ఉన్నారని తెలిపారు. డీపీవో దేవకీ దేవి, వివిధ పార్టీ ప్రతినిధులు పాల్గొన్నారు.