ప్రజావాణి దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలి : కలెక్టర్ హైమావతి

ప్రజావాణి దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలి : కలెక్టర్ హైమావతి
  • కలెక్టర్ హైమావతి

సిద్దిపేట టౌన్, వెలుగు: ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ హైమావతి అధికారులను ఆదేశించారు. సోమవారం సిద్దిపేట కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణిలో అడిషనల్ కలెక్టర్లు గరిమ అగర్వాల్​,  అబ్దుల్ హమీద్ తో కలిసి 114 దరఖాస్తులను స్వీకరించారు. అనంతరం కలెక్టర్​మాట్లాడుతూ ప్రజావాణి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని ఆయ శాఖల అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో డీఆర్​వో నాగరాజమ్మ, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ భవ్య, జిల్లా అధికారులు పాల్గొన్నారు. 

వీఓఏలకు గ్రేడింగ్ తో సంబంధం లేకుండా పెండింగ్ సమస్యలు పరిష్కరించి కనీస వేతనాలు చెల్లించాలని ఐకేపీ, వీవోఏల సంఘం జిల్లా అధ్యక్షుడు తలపాక కిష్టయ్య సీఐటీయూ ఆధ్వర్యంలో ప్రజావాణిలో, పీడీ ఆఫీస్ లో వేర్వేరుగా వినతిపత్రం అందజేశారు. అంతకుముందు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయిపై దాడికి పాల్పడడాన్ని నిరసిస్తూ ఎమ్మార్పీఎస్​జిల్లా అధ్యక్షుడు ముక్కపల్లి రాజు, జిల్లా ఇన్​చార్జి మంద కుమార్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు నిరసన తెలిపారు. 

 ప్రజావాణికి 38 దరఖాస్తులు

సంగారెడ్డి టౌన్: ప్రజావాణికి వచ్చిన ఫిర్యాదులను తక్షణమే పరిశీలించి పరిష్కరించాలని కలెక్టర్ ప్రావీణ్య అధికారులకు సూచించారు. సంగారెడ్డి కలెక్టరేట్​లో అడిషనల్​కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురి, సబ్ కలెక్టర్ ఉమా హారతితో కలిసి వినతులు స్వీకరించారు. కలెక్టర్​మాట్లాడుతూ.. ప్రజావాణికి 38 ఫిర్యాదులు వచ్చినట్లు చెప్పారు. వాటిని ఆయా శాఖల అధికారులు వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.  

 ప్రజావాణికి 58 అర్జీలు 

మెదక్ : ప్రజల సమస్యలు త్వరగా పరిష్కరించేందుకే ప్రజావాణి నిర్వహిస్తున్నట్టు కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. మెదక్​కలెక్టరేట్​ లో నిర్వహించిన ప్రజావాణిలో జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన వారు తమ సమస్యలపై 58 అర్జీలు సమర్పించారు. భూ సమస్యలకు సంబంధించి 24, పెన్షన్ కోసం 10, ఇందిరమ్మ ఇండ్ల కోసం 6, ఇతర సమస్యలపై18  అర్జీలు అందాయి. అధికారులు ప్రజావాణి ద్వారా అందిన ప్రతి అర్జీపై సమగ్ర పరిశీలన చేసి తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. 

 ప్రజల అభ్యర్థనలను గౌరవిస్తూ, పారదర్శకతతో, సమయపాలనతో సేవలందించాలని తెలిపారు. ప్రజావాణి వేదిక ద్వారా ఇప్పటివరకు చాలా సమస్యలు పరిష్కారమయ్యాయని , ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య సమన్వయాన్ని బలపరచడంలో ఈ కార్యక్రమం ముఖ్య పాత్ర పోషిస్తోందని తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్​ కలెక్టర్ నగేశ్, జడ్పీ సీఈఓ ఎల్లయ్య, డీఆర్డీవో శ్రీనివాస్ రావు, ట్రైనీ ఆర్డీఓ మెహమ్మద్ అహ్మద్ పాల్గొన్నారు.