పశు సంరక్షణకు అన్ని చర్యలు తీసుకోవాలి : కలెక్టర్ హైమావతి

పశు సంరక్షణకు అన్ని చర్యలు తీసుకోవాలి : కలెక్టర్ హైమావతి

సిద్దిపేట రూరల్, వెలుగు: పశు సంరక్షణకు అన్ని చర్యలు తీసుకోవాలని కలెక్టర్ హైమావతి అధికారులకు సూచించారు. గురువారం సిద్దిపేట కలెక్టరేట్ లో జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పశువులకు మేత కొరత లేకుండా చూడాలని, ఎప్పటికప్పుడు పశువిజ్ఞాన సదస్సులను నిర్వహించాలన్నారు. వ్యాధులు సంక్రమించకుండా ఎప్పటికప్పుడూ వ్యాక్సినేషన్ అందించాలన్నారు. అన్ని పశువైద్యశాలల్లో అవసరమైన మెడిసిన్ అందుబాటులో ఉంచాలని సూచించారు. 

పౌల్ట్రీ షెడ్లలో కోళ్లు చనిపోయినప్పుడు సరిగ్గా డిస్పోస్ చేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి పూర్ణచందర్, మండల పశు వైద్య అధికారులు పాల్గొన్నారు. అనంతరం మార్కెటింగ్ శాఖ అధికారులు, వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యదర్శులతో సమీక్ష నిర్వహించారు. రైతు బజార్లకు, మార్కెట్ యాడ్ లకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా మార్కెటింగ్ అధికారి నాగరాజు, మార్కెట్ కమిటీల సిబ్బంది పాల్గొన్నారు.