ఎంపీ బండి సంజయ్ మీద జరిగిన దాడిపై స్పందించిన సిద్ధిపేట సీపీ

ఎంపీ బండి సంజయ్ మీద జరిగిన దాడిపై స్పందించిన సిద్ధిపేట సీపీ

సిద్ధిపేటలో సోమవారం ఎంపీ బండి సంజయ్ పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించారన్న వ్యాఖ్యలపై సిద్దిపేట సీపీ జోయల్ డేవిస్ ప్రెస్‌మీట్ నిర్వహించారు. పోలీసులు ఎవరిపట్ల పక్షపాత వైఖరిని ప్రదర్శించడంలేదని ఆయన అన్నారు. ఎంపీ రాకతో శాంతిభద్రతలకు భంగం కలుగుతుందేమోనని ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు సీపీ తెలిపారు. ‘సిద్దిపేటలో లెక్చరర్స్ కాలనీలో అంజన్ రావ్ ఇంట్లో డబ్బులు స్వాధీనం చేసుకున్నాం. అంజన్ రావుతో పాటు జితేందర్ రావుపై కేసు నమోదు చేశాం. పోలీసుల వద్ద నుంచి డబ్బులు లాక్కెళ్లిన 20 మందిని గుర్తించాం. వారిలో ఐదుగురిని అదుపులోకి తీసుకొని.. వారిపై కేసులు నమోదు చేశాం. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పట్ల మేం మర్యాదపూర్వకంగానే వ్యవహరించాం. తాను సిద్ధిపేటకు రావడం లేదని బండి సంజయ్ మాకు సమాచారం ఇచ్చారు. కానీ ఆయన చెప్పకుండా సిద్దిపేటకు రావడం వల్ల శాంతి భద్రతల విషయంలో సమస్య ఏర్పడుతుందని ఆయనను అదుపులోకి తీసుకున్నాం. దుబ్బాక ఉప ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించడం కోసం అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నాం. ఇప్పటికే అదనపు పోలీసు బలగాలను రప్పించడం జరిగింది. ఎన్నికల నియమావళి ప్రకారం పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. అంజన్ రావుకు నోటీసు ఇచ్చి తర్వాత మెజిస్ట్రేట్ ముందు సోదాలు నిర్వహించడం జరిగింది. పంచనామా చేసి బయటకు వస్తుండగా.. బీజేపీ కార్యకర్తలు దాడిచేసి డబ్బులు ఎత్తుకెళ్లారు’ అని సీపీ తెలిపారు.

For More News..

రాజాసింగ్ వీడియో: నేను దుబ్బాక వస్తున్నా.. ఎవడు ఆపుతాడో చూస్తా..

రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ నేతల హౌస్ అరెస్టులు

కేక్ కట్ చేసిన కాసేపటికే కానరానిలోకాలకు.. బర్త్‌డేనే డెత్ డే అయింది