సిద్దిపేట జిల్లాలో ప్రమాదం జరిగింది. కొండపాక మండలం జప్తినాచారం గ్రామ శివారులో ఓ కారు అదుపుతప్పి బావిలో పడింది. ఈ ఘటనలో కారులో ఉన్న యాదగిరి అనే వ్యక్తి చనిపోయాడు. మరో ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారు. కారులో నుంచి బయటపడ్డ ఇద్దరిని సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
ప్రమాదం గురించి తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న రెస్క్యూ టీమ్ సహాయక చర్యలు చేపట్టింది. జేసీబీని తెప్పించిన పోలీసులు కొన్ని గంటలపాటు శ్రమించి కారును బయటికి తీయించారు.
