
- సీఎం చేతుల మీదుగా అవార్డు అందుకున్న కలెక్టర్, డీఈవో
సిద్దిపేట రూరల్, వెలుగు: సిద్దిపేట జిల్లా విద్యారంగంలో అన్ని విభాగాల్లో ఉత్తమ ప్రదర్శన కనబరిచి రాష్ట్రస్థాయి మొదటి అవార్డు అందుకుంది. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా శుక్రవారం హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో జరిగిన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా కలెక్టర్ హైమావతి, డీఈవో శ్రీనివాస్ రెడ్డి అవార్డు ను అందుకున్నారు.
కలెక్టర్ మాట్లాడుతూ సిద్దిపేట జిల్లాలో ప్రభుత్వ బడులను బలోపేతం చేసి, పేద ప్రజలకు నాణ్యమైన విద్యను అందిస్తూ మూడేళ్లుగా ఓవరాల్ పర్ఫామెన్స్ లో జిల్లా రాష్ట్రస్థాయిలో మొదటి స్థానంలో నిలిచిందన్నారు. డీఈవో శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ అవార్డు రావడం వెనుక ఉపాధ్యాయులు, విద్యార్థుల కృషి, తల్లిదండ్రులు, ఉపాధ్యాయ సంఘాల ప్రోత్సాహం ఉందని తెలిపారు.