
బెజ్జంకి, వెలుగు: సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రానికి చెందిన ఉమ్మడి రాంచంద్రాచారి(47) అనారోగ్యంతో దుబాయ్లో శుక్రవారం చనిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఉపాధి కోసం పదేళ్లుగా దుబాయ్లో ఉంటూ భవన నిర్మాణ కార్మికుడిగా పని చేస్తున్నాడని చెప్పారు.
మృతుడికి తల్లిదండ్రులు బ్రహ్మయ్య, సుభద్ర, భార్య భానుమతి, కూతుళ్లు నవ్య, శివ నిత్య ఉన్నారు. డెడ్‌బాడీని రప్పించేందుకు ప్రభుత్వం కృషి చేయాలని జిల్లా గల్ఫ్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు బుర్ర తిరుపతి, శంకర్, గాజుల సంపతి కోరారు.