అద్దె బస్సు డ్రైవర్ల సమ్మె విరమణ: రూ.2000 పెంచిన యాజమాన్యం

అద్దె బస్సు డ్రైవర్ల సమ్మె విరమణ: రూ.2000 పెంచిన యాజమాన్యం

సిద్దిపేట రూరల్, వెలుగు: జీతాలు పెంచాలనే డిమాండ్​తో నిరసన చేపట్టిన ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్లు మంగళవారం సమ్మె విరమించారు. మేనేజర్ రఘు ఆధ్వర్యంలో డ్రైవర్లు, అద్దె బస్సు ఓనర్లతో జరిపిన చర్చలు సఫలమయ్యాయి. ప్రస్తుతం ఇస్తున్న వేతనంతో పాటు రూ.2 వేలు, మరో 2 జతల యూనిఫామ్ అందిస్తామని చెప్పడంతో డ్రైవర్లు సమ్మతించారు. 

ఈ అగ్రిమెంట్ రెండేళ్లు కొనసాగుతుందని సీఐటీయూ జిల్లా కార్యదర్శి గోపాల్ స్వామి, తెలంగాణ పబ్లిక్ ప్రైవేట్ రోడ్ ట్రాన్స్​ఫోర్ట్​వర్కర్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి రవికుమార్  తెలిపారు. సమ్మెలో యూనియన్ కార్యదర్శి పరమేశ్, ఉపాధ్యక్షుడు రమేశ్ రెడ్డి, డ్రైవర్స్ నాగరాజు, అంజిరెడ్డి, రమేశ్, రఫీ, దర్గయ్య, శ్రీనివాస్, రాజు, రవి పాల్గొన్నారు.