సిద్దిపేట జిల్లాలో ఈ నెల 25 నుంచి పోలీస్ యాక్ట్ అమలు

సిద్దిపేట జిల్లాలో ఈ నెల 25 నుంచి పోలీస్ యాక్ట్ అమలు

సిద్దిపేట రూరల్, వెలుగు: సిద్దిపేట జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఈ నెల 25 నుంచి 10వరకు సిటీ  పోలీస్ యాక్ట్ ఆమలులో ఉంటుందని సీపీ అనురాధ తెలిపారు. కమిషనరేట్ పరిధిలో అనుమతి లేకుండా ఎలాంటి ధర్నాలు, ర్యాలీలు, రాస్తారోకోలు, సభలు, సమావేశాలు నిర్వహించకూడదన్నారు. డీజేలపై నిషేధాజ్ఞలు ఉన్నాయని చెప్పారు. మైక్ సెట్ వినియోగం తప్పనిసరి అనిపిస్తే ఏసీపీ అధికారుల అనుమతి పొందాలని సూచించారు. పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించాలని, పోక్సో, ఎస్సీ, ఎస్టీ కేసుల్లో 60 రోజుల్లో ఇన్వెస్టిగేషన్ పూర్తి చేయాలని సీపీ అనురాధ ఆదేశించారు.

మంగళవారం హుస్నాబాద్ డివిజన్ పోలీస్ అధికారులతో సీపీ ఆఫీస్ లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కేసు నమోదైన వెంటనే నిందితులను అరెస్టు చేయాలన్నారు. స్థానిక ఎన్నికల సందర్భంగా ఎన్​ఫోర్స్​మెంట్​విధులు నిర్వహించాలని సూచించారు. డయల్ 100 కాల్ రాగానే వెంటనే రెస్పాండ్ అయి సంఘటనా స్థలానికి వెళ్లి సమస్య పరిష్కరించాలని ఆదేశించారు.  అడిషనల్ డీసీపీ అడ్మిన్ కుశాల్కర్, ఏసీపి సదానందం, సీఐలు శ్రీనివాస్, శ్రీను, రామకృష్ణ, శ్రీధర్ గౌడ్, ఎస్ఐలు లక్ష్మారెడ్డి, అభిలాష్, రాజు, నవీన్ పాల్గొన్నారు.