డబుల్ ఎనర్జీతో టిల్లు స్క్వేర్‌‌‌‌

డబుల్ ఎనర్జీతో టిల్లు స్క్వేర్‌‌‌‌

‘డీజే టిల్లు’ చిత్రంతో హీరోగా ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న సిద్ధు జొన్నలగడ్డ.. ఇప్పుడు ఈ మూవీ సీక్వెల్‌‌తోప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. మల్లిక్ రామ్ దర్శకుడు. అనుపమ పరమేశ్వరన్‌‌ హీరోయిన్‌‌. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. శుక్రవారం సినిమా రిలీజ్​ సందర్భంగా సిద్ధు జొన్నలగడ్డ ఇలా ముచ్చటించాడు. 

‘‘డీజే టిల్లు కథను, పాత్రను గుర్తు చేస్తూనే కొత్త అనుభూతిని పంచేలా ఈ సీక్వెల్ ఉంటుంది. ఈసారి ఇంకాస్త పెద్ద సమస్యలో ఇరుక్కుంటాడు టిల్లు. చాలా షాక్‌‌లు, సర్‌‌‌‌ప్రైజ్‌‌లు ఉంటాయి. వాటన్నింటినీ థియేటర్‌‌‌‌లో ప్రేక్షకులు చూసి చాలా ఎంజాయ్ చేస్తారు. ముఖ్యంగా టిల్లు క్యారెక్టర్ డబుల్‌‌ ఎనర్జిటిక్‌‌గా ఉంటుంది. అతను ఎక్కడా నవ్వడు కానీ అందరినీ ఫుల్‌‌గా నవ్విస్తాడు. గత చిత్రం తరహాలోనే ఇందులోనూ హీరోయిన్‌‌ పాత్రకు ప్రాధాన్యత ఉంటుంది. ఆ పాత్ర లేకపోతే హీరో పాత్ర పండదు. ఇక సీక్వెల్‌‌ చేద్దాం అనుకున్న టైమ్‌‌లో విమల్ మరో ప్రాజెక్ట్‌‌తో బిజీగా ఉండటంతో మల్లిక్‌‌ను తీసుకున్నాం.

నిజానికి అదే సమయానికి నేను, మల్లిక్ ఓ సినిమా చేద్దామనుకున్నాం. అది ఇలా కుదిరింది. త్రివిక్రమ్ గారి సలహాలు, సూచనలు కచ్చితంగా మా సినిమాకి హెల్ప్ అవుతాయి. కానీ ఆయనెప్పుడూ మా కథలో మార్పులు చెప్పలేదు. సినిమాలో ఏ భాగం బెటర్‌‌‌‌ చేస్తే బాగుంటుందనేది చెప్పేవారు. మొదటి భాగానికి థమన్ మ్యూజిక్ ఎంత ప్లస్‌‌ అయిందో, దీనికి భీమ్స్ మ్యూజిక్ అంతే కలిసొస్తుంది. నేనే డైలాగ్స్ రాయడం వల్ల, ఏ ఉద్దేశంతో రాశాను, వాటిని ఎలా పలకాలి అనే విషయంపై ఫుల్ క్లారిటీ ఉంటుంది.

అందుకే ఈ పాత్ర ప్రేక్షకులకు అంతగా కనెక్ట్ అయింది. కామెడీ సినిమాకు నిడివి తక్కువ ఉంటేనే ప్రేక్షకులు బోర్ ఫీలవ్వరని భావించి తగ్గించాం. ఇక బొమ్మరిల్లు భాస్కర్‌‌‌‌ గారి డైరెక్షన్‌‌లో ఓ సినిమా చేస్తున్నా. యాక్షన్ కామెడీ జానర్‌‌‌‌లో ఉండే ఈ మూవీ చిత్రీకరణ దశలో ఉంది. అలాగే ‘తెలుసు కదా’ చిత్రం స్క్రిప్ట్ వర్క్ పూర్తయింది”.