డీజే టిల్లు(DJ Tillu) సినిమాతో యూత్ లో ఫుల్ క్రేజ్ సంపాదించుకున్నారు యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ(Siddu Jonnalagadda). ఈ సినిమా ఇచ్చిన బూస్టప్ తో మనోడికి వరుస ఆఫర్స్ వస్తున్నాయి. అందులో భాగంగానే నీరజ కోన (Neeraja Kona) తో కలిసి కొత్త మూవీని స్టార్ట్ చేశాడు. నీరజ వినిపించిన స్టోరీ లైన్ సిద్దును ఇంప్రెస్ చేసిందట.
లేటెస్ట్ అప్డేట్ ప్రకారం..ఈ మూవీలో సిద్ధుకు జోడీగా ఇద్దరు హీరోయిన్స్ నటిస్తున్నారు. రాశి ఖన్నా(Raashikhanna) అండ్ శ్రీనిధి శెట్టి(Srinidhishetty)ని ఎంపిక చేశారని సమాచారం. త్వరలో ఈ ముద్దుగుమ్మలు సిద్దు తో కలిసి రొమాంటిక్ సీన్స్ లో నటిస్తున్నారని టాక్ వినిపిస్తోంది.
ఇటీవల కాలంలో రాశి ఖన్నా తన ఫామ్ ను కోల్పోయి..కేవలం సోషల్ మీడియాలో గ్లామర్ కే పరిమితమైంది.ఇక మంచి ఫామ్ లో ఉన్న సిద్దుతో నటించే ఛాన్స్ రావడంతోరాశికన్నా కు కాలం కలిసి వచ్చిందనే విషయం అర్ధం అవుతుంది. మరో బ్యూటీ కేజీఎఫ్ మూవీతో ఇండియా వైడ్ గా ఫేమస్ అయిన శ్రీనిధి శెట్టి వరుస ఆఫర్స్ తో దూసుకెళ్తుంది. తన వరకు వచ్చే స్టోరీస్ లో .. కథ ప్రాధాన్యం ఉన్న సినిమాలనే మాత్రమే సెలెక్ట్ చేసుకుంటూ సినిమా ల్లో నటిస్తోంది. మరి సిద్దు జొన్నలగడ్డతో ఎటువంటి సక్సెస్ ను అందుకుంటారో చూడాలి మరి.
ప్రసెంట్ డీజే టిల్లు సినిమాతో సూపర్ క్రేజ్ సంపాదించుకున్న సిద్దు..ప్రస్తుతం టిల్లు 2 (Tillu Square)తో బిజీగా ఉన్నాడు.ఈ మూవీలో హీరోగా నటిస్తూనే..రైటర్‌గా కూడా వ్యవహరిస్తున్నాడు సిద్దు. అలాగే దట్ ఈజ్ మహాలక్ష్మి, థల్లుమాలా రీమేక్‌లో కూడా నటిస్తున్నాడు.