Karteekamasam special 2025: కాలభైరవజయంతి.. శివతాండవం జరిగిన రోజు ఇదే..!

Karteekamasam special 2025: కాలభైరవజయంతి.. శివతాండవం జరిగిన రోజు ఇదే..!

కార్తీక మాసంను అత్యంత పవిత్రమైన మాసంగా భావిస్తారు. ముఖ్యంగా ఈ మాసం అంతట కూడా ఏదో ఒక పండగ, పూజలు, వ్రతాలు ఉంటాయి.  అదే విధంగా ఈ మాసంలో చేసే పూజలు వ్రతాలు వెయ్యిరెట్లు అధిక ఫలితాలను ఇస్తాయని పండితులు చెబుతుంటారు. కార్తీకమాసం బహుళ పక్షం అష్టమి రోజున ( నవంబర్​ 12) కాలభైరవ జయంతిని జరుపుకుంటున్నారు. 

పురాణాల ప్రకారం... కాల భైరవుడు.. శివుడి కోపం నుంచి జన్మించాడు.  సతీదేవి  తండ్రి చసిన దక్షయఙ్ఞం క్రతువుకు ఆహ్వానం లేకుండానే వెళ్లింది.  ఆ సమయంలో కుమార్తె అని కూడా చూడకుండా  ఘోరంగా అవమానించాడు. దీంతో సతీదేవి ఆత్మార్పణం చేసుకుంటుంది. దీంతో ఆగ్రహించిన పరమేశ్వరుడు  రౌద్ర ( కోపంతో) రూపంలో  అక్కడకు వచ్చి   శివతాండవం చేసి తన తలవెంట్రుకను ఒకదాన్ని భూమి మీదకు విసురుతాడు.

అది కాస్త కాలభైరవుడిలా ఉద్భవిస్తుంది. ఆయన ఉగ్రస్వరూపంగా వెళ్లి దక్షరాజు శిరచ్ఛేదం చేస్తాడు. ఆతర్వాత శివుడు శాంతిస్తాడు. దక్ష రాజుకు మేకతలను ధరింపచేస్తాడు. తన తప్పును తెలుసుకున్నందుకు దక్షరాజును శివుడు అనుగ్రహిస్తాడు  అప్పటి నుంచి కార్తీక మాసంలో అష్టమి రోజున కాలభైరవాష్టమిని జరుపుకుంటారు.స్కంద పురాణం చెప్పినట్లుగా, ఆయన శివుని కోపం నుండి బ్రహ్మ గర్వాన్ని అణచివేయడానికి ఉద్భవించి కాశీకి వచ్చాడు. అక్కడ ఆయన ఈ భూమికి శాశ్వత రక్షకుడయ్యాడు.

కాలభైరవ జయంతి 2025 శుభ ముహూర్తం

  • కాలభైరవ జయంతిశుభముహూర్తం: నవంబర్12 బుధవారంమధ్యాహ్నం 01:53నుండి02:36 వరకు
  • కాలభైరవ జయంతి పూజా ముహూర్తం: సాయంత్రం 05:29 నుండి 05:55 వరకు
  • సాయంత్రం సంధ్య దీపారాధన సమయం : 05:29 నుండి 06:48 వరకు
  • అమృత కాలం: సాయంత్రం 04:58 నుండి 06:35 వరకు

కాలభైరవ జయంతి 2025 పూజా విధానం

ఆలయం లేదా ఇంటి పూజ గదిలో కాలభైరవుడి విగ్రహం లేదా చిత్రాన్ని ఏర్పాటు చేయాలి.
ఆవ నూనెతో దీపారాధన చేయాలి.
భైరవ చాలీసా లేదా "ఓం భైరవాయ నమః" మంత్రాన్ని 108 సార్లు జపించండి.
భైరవుడుకి నల్ల నువ్వులు, మినపప్పు, నూనె, కొబ్బరికాయని సమర్పించండి.
రాత్రిపూట మేల్కొని భైరవ మంత్రాలను పఠించవచ్చు.
ఓం భైరవాయ నమః అనే మంత్రాన్ని పఠించడం వల్ల జీవితంలో భయం, ప్రతికూలత, అడ్డంకులను తొలగిస్తుంది.
 చాలా మంది శునకాలకు ఈరోజున చపాతీలు, పాలు పెడుతుంటారు. కాలభైరవుడి అనుగ్రహం కోసం శివుడికి అభిషేకం చేస్తారు.

ముఖ్యంగా శత్రుబాధలు ఉన్నవారు కాలభైరవ జయంతి రోజున శివుడికిఅభిషేకంతో పాటు, ఉపవాసం, కుక్కలకు చపాతీలు పెడితే శకునిలాంటి పన్నాగాలు పన్నే వారి కుయుక్తులు కూడా వారి మెడకే చుట్టుకుంటాయని పండితులు చెబుతున్నారు. ఈ క్రమంలో ఉత్తరాదిన రాష్ట్రాల ప్రజలు కాలభైరవ జయంతిని ఎంతో భక్తితో జరుపుకుంటారు. ఈ రోజున పేదలకు అన్నదానాలు, వస్త్రాలు దానంగా ఇస్తారు.

 భైరవ భక్తులకు ఈ రోజు  ( నవంబర్​ 12) చాలా ప్రత్యేకమైనది ఎందుకంటే ఈ రోజున శివుడు కాల భైరవుడి రూపంలో అవతరించి అధర్మం, అహంకారాన్ని నాశనం చేశాడు. దీనిని భైరవ అష్టమి, కాలాష్టమి లేదా కాలభైరవ జయంతి అని కూడా పిలుస్తారు. ఈ రోజున, కాలభైరవ దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తారు. భైరవ చాలీసా, రాత్రి మేల్కొలుపు నిర్వహిస్తారు.

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని  పురాణాల ప్రకారం పండితులు నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించలేదు. మీకున్న ఆధ్యాత్మిక నిపుణులను సంప్రదించటం ఉత్తమం.