జన్ధన్ ఖాతాలు 50 కోట్లు దాటాయి.. అకౌంట్ హోల్డర్లలో మహిళలే టాప్

జన్ధన్ ఖాతాలు 50 కోట్లు దాటాయి.. అకౌంట్ హోల్డర్లలో మహిళలే టాప్

జన్ ధన్ ఖాతాలు 50 కోట్ల మార్క్ ను దాటాయి. ఈ మార్క్ ముఖ్యమైన మైలురాయి అని.. వీటిలో సగానికి పైగా మహిళలవి అయి ఉండటం ప్రశంసనీయమని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.  దేశంలో మొత్తం 50 కోట్ల మార్క్ ను దాటిందని అందులో 56 శాతం మహిళలవే ఉన్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వీటిలో దాదాపు 67 శాతం ఖాతాలు గ్రామీణ, సెమీ అర్భన్ ప్రాంతాల్లో ప్రారంభించినట్లు మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. 
జన్ ధన్ ఖాతాల్లో మొత్తం డిపాజిట్లు రూ. 2.03 లక్షల కోట్లకు పైగా ఉండగా.. ఈ ఖాతాలలో దాదాపు 34 కోట్ల రూపే కార్డులను ఉచితంగా జారీ చేసినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొంది. 
2014లో  మోదీ ప్రభుత్వం జన్ ధన్ ఖాతాలను తెరవడం ప్రారంభించింది.  పేదలకు కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధి బదిలీ,  ఆర్థిక సేవలు అందించేందుకు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున కసరత్తులు చేపట్టింది.