డాక్టర్లు, పోలీసులకు ఫ్రీగా పిజ్జాలు అందిస్తున్న సిక్కులు

డాక్టర్లు, పోలీసులకు ఫ్రీగా పిజ్జాలు అందిస్తున్న సిక్కులు

న్యూయార్క్: అమెరికాలో కరోనాపై పోరులో ముందుండి పోరాడుతున్న పోలీసులు, వైద్య సిబ్బందికి కొందరు సిక్కు కమ్యూనిటీ వ్యక్తులు ఉచితంగా పిజ్జాలు అందిస్తుండటం విశేషం. న్యూయార్క్ లోని ఆస్పత్రులు, పోలీస్ స్టేషన్స్ లో సుమారు 1,000కి పైగా పిజ్జాలను వీరు ఫ్రీగా అందించారు. శలిందర్ సింగ్ అనే వ్యక్తి తన ఫ్యామిలీతో కలసి ఈ పని చేస్తున్నాడు. ‘నా మదిని ఒక విషయం బాగా తొలిచివేసింది. కరోనాపై పోరాడుతున్న వారికి అండగా నిలవాల్సిన టైమ్ ఇది. నేను కొందరు డాక్టర్స్ తో మాట్లాడా. ఈ టైమ్ లో తమకు పిజ్జా తినడమే బెస్ట్ అని వారు చెప్పారు. రోజూ 12 నుంచి 16 గంటలు పని చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో కూర్చొని తినడానికి వారికి అంతగా టైమ్ ఉండదు. ఎక్కువగా ఫుడ్ అందని ప్రాంతాలకు వెళ్లడానికి మేం ప్రయత్నిస్తున్నాం’ అని శలిందర్ చెప్పారు. 25 ఏళ్ల జప్నీత్ సింగ్ అనే మరో సిక్కు కూడా రోజు వారీ కూలీలతోపాటు వైద్య సిబ్బందికి పిజ్జాలు అందిస్తున్నాడు. ‘వీళ్లు కనీస వేతన కార్మికులు. కొన్ని పీజాలతో వీరి ముఖాల్లో నవ్వులు చిందించొచ్చు. ఈ పని చేయడం మన ధర్మం’ అని జప్నీత్ పేర్కొన్నాడు.