
శిల్పారామంలో వీకెండ్ సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఆదివారం సాయంత్రం నృత్య దీక్షలయా గురువు లక్ష్మిశంకర్ శిష్య బృందం ప్రదర్శించిన కూచిపూడి నృత్య ప్రదర్శన అలరించింది. జగదానందకారకా, జతిస్వరం, గీత రసికే, మండూక శబ్దం, అప్సరసలు, నమశ్శివాయతే, వందే మీనాక్షి, రామాయణ శబ్దం, పరమ పురుషుడు, మంగళం అంశాలను ప్రదర్శించి మెప్పించారు.