
- ఘనంగా ముగిసిన రజతోత్సవాలు
కోల్బెల్ట్, వెలుగు: మందమర్రి పంచముఖ హనుమాన్ ఆలయ రజతోత్సవాలు ఘనంగా ముగిశాయి. బుధవారం 108 కలశాలతో వాయుపుత్రుడికి అభిషేకం నిర్వహించారు. త్రిదండి రామానుజ జీయర్ స్వామి ఆధ్వర్యంలో 108 మంది పూజారుల మంత్రోచ్ఛరణ నడుమ ఆంజనేయస్వామికి అభిషేకాలు చేపట్టారు. భక్తుల శ్రీరామ నామస్మరణతో ఆలయ ఆవరణ మార్మోగింది. పండ్ల రసాలు, పంచామృతాలతో స్వామివారికి పూజలు చేసి రామాయణ హోమాన్ని ముగించారు. అంతకు ముందు ఆలయ పైభాగంలో సుదర్శన చక్రాన్ని ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు చేశారు.