మందమర్రిలో భక్తి శ్రద్ధలతో అగ్ని ప్రతిష్ఠాపన

మందమర్రిలో భక్తి శ్రద్ధలతో అగ్ని ప్రతిష్ఠాపన
  • రెండో రోజు ఘనంగా సాగిన పంచముఖ హనుమాన్ ​ఆలయ రజతోత్సవాలు 

 కోల్​బెల్ట్, వెలుగు: మందమర్రి పంచముఖ హనుమాన్ ఆలయం జరుగుతున్న రజతోత్సవాల్లో భాగంగా రెండో రోజు ఆదివారం అగ్ని ప్రతిష్ఠాపన కార్యక్రమం నిర్వహించారు.- త్రిదండి దేవనాథ రామానుజ జీయర్ స్వామి పర్యవేక్షణలో వేదపండితులు వైదిక పద్ధతిలో అగ్ని ఆవిర్భావం, రామాయణ యాగాదులను చేపట్టారు. అనంతరం సమీపంలోని మిథిలా స్టేడియంలో పాంచాహ్నిక, పంచకుండాత్మక వివిదేష్టి సహిత శ్రీ ఆంజనేయస్వామి హవనములు ప్రారంభించారు.

సాయంత్రం లక్ష తమలపాకులతో ప్రత్యేక పూజలు చేశారు. పూజల్లో మందమర్రి ఏరియా సింగరేణి జీఎం జి.దేవేందర్–-స్వరూపారాణి దంపతులు పాల్గొన్నారు. యాజ్ఞికులు సముద్రాల శ్రీనివాసాచార్యులు, గోవర్ధనగిరి అనంతచారి, కుమారాచార్యులు, నవీన్ చార్యులు, పంచముఖి ఆంజనేయ స్వామి ఆలయ స్థానాచార్యులు కృష్ణ చైతన్యచార్యులు, శ్రీకాంతాచార్యులు, నరసింహాచార్యులు, వేద పండితులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.