
న్యూఢిల్లీ: ఇండియా స్టార్ స్విమ్మర్ శ్రీహరి నటరాజ్ మేర్ నోస్ట్రమ్ స్విమ్మింగ్ టూర్ లో సిల్వర్ మెడల్‌తో మెరిశాడు. ఫ్రాన్స్‌లోని కానెట్–-ఎన్–-రౌసిలోన్‌లో ఆదివారం జరిగిన నాన్ ఒలింపిక్ ఈవెంట్ 50 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్ లో శ్రీహరి 25.50 సెకన్ల టైమింగ్‌తో రెండో స్థానంతో వెండి పతకం ఖాతాలో వేసుకున్నాడు. హంగేరికి చెందిన ఆడమ్ జస్జో 25.46 సెకన్లతో గోల్డ్ నెగ్గగా, స్కీట్ జిబ్సన్ (గ్రేట్ బ్రిటన్) 25.64 సెకండ్లతో మూడో ప్లేస్‌తో బ్రాంజ్ గెలిచాడు.
టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొన్న శ్రీహరి ఈ ఈవెంట్‌లో పర్సనల్ బెస్ట్ టైమింగ్ 25.11 సెకన్లుగా ఉంది. కాగా, ఇండియా నుంచి ఇప్పటివరకు ఒక్క స్విమ్మర్ కూడా పారిస్ ఒలింపిక్స్‌కు క్వాలిఫై అవ్వలేదు.