అరటి పండ్లు ఎక్కువ రోజులు ఫ్రెష్ గా ఉండాలంటే ఏం చేయాలంటే

అరటి పండ్లు ఎక్కువ రోజులు ఫ్రెష్ గా ఉండాలంటే ఏం చేయాలంటే

ఇండియన్స్ చాలా ఇష్టపడే అరటిపండులో శరీరానికి అవసరమయ్యే పోషకాలు చాలా ఉన్నాయి. ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఎముకల ఆరోగ్యానికి మేలు చేస్తుంది, ఉబ్బరం తగ్గించడంతో పాటు మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. ఆరోగ్యకరమైన జీవనం కోసం సాధారణంగా రోజుకు 1 నుంచి 2 అరటిపండ్లను తినాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. డయాబెటిక్ ఉన్న వారు మాత్రం దీన్ని వైద్యున్ని సంప్రదించిన తర్వాతే తీసుకోవడం ఉత్తమం.

అరటిపండ్లను రోజూ తినొచ్చు. అయితే వాటిని ఎక్కువ కాలం తాజాగా ఉంచడమనేది కొంచెం కష్టంతో కూడుకున్న పని. అరటిపండ్లను ఎక్కువకాలం తాజాగా ఉంచడంలో సహాయపడే కొన్ని సింపుల్ హాక్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

  • చాలా మంది అరటిపండ్లను ప్లాస్టిక్, పాలిథిన్ కవర్లలో నిల్వ ఉంచుతూ ఉంచుతారు. దాని వల్ల పండ్లు త్వరగా పాడైపోతాయి. కాబట్టి వాటిని ప్లాస్టిక్ కవర్స్ కు బదులుగా పేపర్ బ్యాగుల్లో పెడితే ఎక్కువ కాలం ఫ్రెష్ గా ఉంటాయి.
  • అరటిపండ్లను ఎక్కువకాలం తాజాగా ఉంచాలంటే మరొక పరిష్కార మార్గమేమిటంటే.. ముందుగా అరటిపండ్లను సెపరేట్ చేసుకోవాలి. ఆ తర్వాత వాటి కాడ పై భాగాన్ని ప్లాస్టిక్ కవర్ తో చుట్టిపెట్టాలి. ఇలా చేయడం వల్ల కూడా అరటిపండ్లను ఎక్కువ రోజులు ఫ్రెష్ గా ఉంచొచ్చు.