మలేసియా మాస్టర్స్‌‌‌‌‌‌‌‌ సూపర్‌‌‌‌‌‌‌‌–500 టోర్నీలో ప్రిక్వార్టర్స్‌‌‌‌‌‌‌‌లో సింధు

మలేసియా మాస్టర్స్‌‌‌‌‌‌‌‌ సూపర్‌‌‌‌‌‌‌‌–500 టోర్నీలో ప్రిక్వార్టర్స్‌‌‌‌‌‌‌‌లో సింధు

కౌలాలంపూర్‌‌‌‌‌‌‌‌: ఇండియా స్టార్‌‌‌‌‌‌‌‌ షట్లర్‌‌‌‌‌‌‌‌ పీవీ సింధు.. మలేసియా మాస్టర్స్‌‌‌‌‌‌‌‌ సూపర్‌‌‌‌‌‌‌‌–500 టోర్నీలో ప్రిక్వార్టర్స్‌‌‌‌‌‌‌‌లోకి ప్రవేశించింది. బుధవారం జరిగిన విమెన్స్‌‌‌‌‌‌‌‌ సింగిల్స్‌‌‌‌‌‌‌‌ తొలి రౌండ్‌‌‌‌‌‌‌‌లో వరల్డ్‌‌‌‌‌‌‌‌ 15వ ర్యాంకర్‌‌‌‌‌‌‌‌ సింధు 21–17, 21–16తో క్రిస్టీ గిల్మోర్‌‌‌‌‌‌‌‌ (స్కాట్లాండ్‌‌‌‌‌‌‌‌)పై గెలిచింది. 46 నిమిషాల మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో తెలుగమ్మాయికి పోటీ ఎదురైనా కీలక టైమ్‌‌‌‌‌‌‌‌లో వరుస పాయింట్లతో ఆకట్టుకుంది. మరో మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో అష్మితా చాలియా 21–17, 21–16తో లిన్‌‌‌‌‌‌‌‌ సిహ్‌‌‌‌‌‌‌‌ యున్‌‌‌‌‌‌‌‌ (చైనీస్‌‌‌‌‌‌‌‌తైపీ)పై నెగ్గగా, ఉన్నతి హుడా 13–21, 18–21తో గావో ఫెంగ్‌‌‌‌‌‌‌‌ జీ (చైనా) చేతిలో ఓడింది.

మెన్స్‌‌‌‌‌‌‌‌ సింగిల్స్‌‌‌‌‌‌‌‌లో కిరణ్‌‌‌‌‌‌‌‌ జార్జ్‌‌‌‌‌‌‌‌ 21–16, 21–17తో టకుమా ఒబాయషి (జపాన్‌‌‌‌‌‌‌‌)పై, డబుల్స్‌‌‌‌‌‌‌‌లో కృష్ణ ప్రసాద్‌‌‌‌‌‌‌‌–సాయి ప్రతీక్‌‌‌‌‌‌‌‌ 23–21, 21–11తో మింగ్‌‌‌‌‌‌‌‌ చె లు–టాంగ్‌‌‌‌‌‌‌‌ కాయ్‌‌‌‌‌‌‌‌ వీ (చైనీస్‌‌‌‌‌‌‌‌తైపీ)పై గెలిచారు. మిక్స్‌‌‌‌‌‌‌‌డ్‌‌‌‌‌‌‌‌ డబుల్స్‌‌‌‌‌‌‌‌లో సుమిత్‌‌‌‌‌‌‌‌ రెడ్డి–సిక్కి రెడ్డి 21–15, 12–21, 21–17తో లు చున్‌‌‌‌‌‌‌‌ వాయ్‌‌‌‌‌‌‌‌–ఫు చమ్‌‌‌‌‌‌‌‌ యాన్‌‌‌‌‌‌‌‌ (హాంకాంగ్‌‌‌‌‌‌‌‌)పై నెగ్గారు. ఆకర్షి కశ్యప్‌‌‌‌‌‌‌‌ 22–24, 13–21తో వాంగ్‌‌‌‌‌‌‌‌ జి యి (చైనా) చేతిలో కంగుతిన్నది.