
సింగపూర్: ఒలింపిక్ డబుల్ మెడలిస్ట్, ఇండియా స్టార్ షట్లర్ పీవీ సింధు.. సింగపూర్ ఓపెన్ సూపర్–750 టోర్నీలో ప్రిక్వార్టర్స్‌కు చేరుకుంది. బుధవారం జరిగిన విమెన్స్ సింగిల్స్ తొలి రౌండ్‌లో సింధు 21–12, 22–20తో లైన్ హోజ్‌మార్క్ కాస్‌ఫెల్డెట్ (డెన్మార్క్)పై నెగ్గింది. మెన్స్ సింగిల్స్‌లో హెచ్. ఎస్. ప్రణయ్ 21–9, 18–21, 21–9తో జులియెన్ కరాగి (బెల్జియం)పై గెలిచాడు.
లక్ష్యసేన్ 13–21, 21–16, 13–21తో వరల్డ్ నంబర్‌వన్ విక్టర్ అక్సల్‌సేన్ (డెన్మార్క్) చేతిలో ఓడగా, మరో మ్యాచ్‌లో కిడాంబి శ్రీకాంత్ స్కోరు 14–21, 3–11 వద్ద ఉండగా కొడాయ్ నరోకా (జపాన్)కు వాకోవర్ ఇచ్చాడు. విమెన్స్ డబుల్స్‌లో ట్రీసా జోలీ–గాయత్రి గోపీచంద్ 21–7, 21–14తో చెంగ్ యు పీ–సన్ యు సింగ్ (చైనీస్‌తైపీ) పై నెగ్గగా, తనీషా క్రాస్టో–అశ్విని పొనప్ప 21–18, 19–21, 19–21తో పోలినా బరోవా–యెలినా కంటెమర్ (ఉక్రెయిన్) చేతిలో మిక్స్‌డ్ డబుల్స్‌లో సిక్కి రెడ్డి–సుమిత్ రెడ్డి 18–21, 19–21తో గోహ్ సున్ హుట్–షివోన్ జెమీ (మలేసియా) చేతిలో ఓడారు.