ఫేక్ అటెండెన్స్.. ఇద్దరు కార్యదర్శులు ఔట్

ఫేక్ అటెండెన్స్.. ఇద్దరు కార్యదర్శులు ఔట్

రంగారెడ్డి కలెక్టరేట్, వెలుగు: ఫేషియల్ రికగ్నిషన్ యాప్​లో తప్పుడు అటెండెన్స్​ నమోదు చేసిన జీపీ కార్యదర్శులపై వేటు పడింది. రంగారెడ్డి జిల్లాలోని ఆమన్​గల్ మండలం సింగంపల్లి గ్రామపంచాయతీ కార్యదర్శి జంగయ్య, ఫరూక్ నగర్ మండలం భీమరం గ్రామపంచాయతీ కార్యదర్శి అనిల్ కుమార్  ఫేషియల్​ రికగ్నిషన్​ యాప్​లో తప్పుడు అటెండెన్స్​ నమోదు చేసినట్లు అధికారుల దృష్టికి వచ్చింది. దీంతో ఇద్దరిని సస్పెండ్​ చేస్తూ డీపీవో సురేశ్​ మోహన్​ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఫరూక్ నగర్ మండలం రామేశ్వరం పంచాయతీ కార్యదర్శి రమేశ్​ను ఒక రోజు సర్వీస్  నుంచి తొలగించారు. మరో 8 మంది కార్యదర్శులపై చర్యలకు కలెక్టర్ అనుమతి కోసం ఎదురుచూస్తున్నట్లు ఆయన తెలిపారు.