ఒకే ‘బెంచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’పై.. సీజేఐ, సింగపూర్ సీజే

ఒకే ‘బెంచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’పై.. సీజేఐ, సింగపూర్ సీజే

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో శుక్రవారం ఆసక్తికర, అరుదైన సన్నివేశం జరిగింది. సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ ఆధ్వర్యంలోని బెంచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సింగపూర్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సుందరేశ్ మీనన్ కూర్చున్నారు. సింగపూర్ సుప్రీంకోర్టు సీజే జస్టిస్ మీనన్.. 2012 నుంచి ఆ పదవిలో కొనసాగుతున్నారు. సుప్రీంకోర్టు 73వ వార్షికోత్సవం సందర్భంగా శనివారం నిర్వహించే కార్యక్రమంలో పాల్గొనేందుకు జస్టిస్ మీనన్ వచ్చారు. ఈ సందర్భంగానే సీజేఐ బెంచ్ తోపాటు కోర్టులో కూర్చున్నారు.

శనివారం నిర్వహించే కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరు కానున్న జస్టిస్ మీనన్.. ‘ప్రపంచాన్ని మార్చడంలో న్యాయ వ్యవస్థ పాత్ర’ అనే అంశంపై మాట్లాడనున్నారు. ‘‘సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్, సుప్రీంకోర్టు సీనియర్ జడ్జిలతో సింగపూర్ సీజే జస్టిస్ మీనన్ చర్చలు జరుపుతారు. రెండు న్యాయవ్యవస్థల మధ్య మరింత సహకారం, న్యాయ విద్య, నైపుణ్యాన్ని పంచుకునే అవకాశాల గురించి చర్చించే అవకాశం ఉంది’’ అని సుప్రీంకోర్టు తెలిపింది. కాగా, భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి.. ఇండియా రిపబ్లిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా అవతరించిన రెండు రోజుల తర్వాత 1950 జనవరి 28న సుప్రీంకోర్టు మనుగడలోకి వచ్చింది.