
కోదాడ, వెలుగు: ఉద్యోగ రీత్యా సింగపూర్ వెళ్లిన కోదాడకు చెందిన ఓ యువకుడు.. అక్కడ సముద్రంలో ఈతకు వెళ్లి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. కోదాడకు చెందిన చౌడవరపు శ్రీనివాసరావు కొడుకు పవన్ సింగపూర్ లో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేస్తున్నాడు. శుక్రవారం అతను సింగపూర్ లోని ఓ బీచ్ లో శవంగా కనిపించాడు. బీచ్ లో పవన్ డెడ్ బాడీని గుర్తించిన పోలీసులు పాస్ పోర్ట్ సహాయంతో తోటి మిత్రులను విచారిస్తున్నారు.
అతడు ఈతకు వెళ్లి మరణించాడా లేక ఇతర కారణాల వల్ల మరణించాడా అనే విషయంపై విచారణ జరుపుతున్నారు. పవన్ మృతిపై అక్కడి అధికారులు కోదాడలోని తల్లిదండ్రులకు సమాచారమిచ్చారు. ఉద్యోగం కోసం వెళ్లిన బిడ్డ విగతజీవిగా మారడని తెలీయడంతో ఆ ఫ్యామిలీ మెంబర్స్ కన్నీరుమున్నీరు అవుతున్నారు. కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి తమ బిడ్డ మృతదేహాన్ని త్వరగా తమకు చేరేలా చర్యలు తీసుకురావాలన్నారు.