మెడికల్ కాలేజీ కోసం రూ.500 కోట్లు కేటాయించిన సింగరేణి

మెడికల్ కాలేజీ కోసం రూ.500 కోట్లు కేటాయించిన సింగరేణి

రామగుండం ప్రాంతంలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలన్న తెలంగాణ ప్రజల కోరిక త్వరలోనే నెరవేరనుంది. కార్మికుల 50 ఏళ్ల కల సాకారం చేసేందుకు సింగరేణి  సంస్థ ముందుకొచ్చింది. రామగుండం మెడికల్ కాలేజీ నిర్మాణానికి రూ.500 కోట్లు కేటాయించింది. సంస్థ చైర్మన్, ఎండీ ఎన్. శ్రీధర్ ప్రత్యేక చొరవతో ఈనెల 10న జరిగిన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల సమావేశంలో రూ.500 కోట్ల నిధుల కేటాయింపునకు ఆమోదం తెలిపారు. ఇవాళ కొత్తగూడెంలో జరిగిన సింగరేణి 100వ వార్షిక సర్వసభ్య సమావేశంలో నిధుల కేటాయింపు నిర్ణయానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో రామగుండం ఏరియాలో మెడికల్ కాలేజీ, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. హాస్పిటల్ నిర్మాణం రెండేళ్లలో పూర్తి చేయాలని నిర్ణయించారు. మెడికల్ కాలేజీ ఏర్పాటుతో కార్మికులకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి.

For more news..

2023 తర్వా త ఉజ్వల భవిష్యత్

వరంగల్ లో రెండో ఒమిక్రాన్ కేసు