గోదావరిఖని, వెలుగు: మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో గురువారం నుంచి జరగనున్న కోల్ ఇండియా స్థాయి సాంస్కృతిక పోటీలకు సింగరేణి కళాకారులు బుధవారం తరలివెళ్లారు. ఇటీవల మందమర్రిలో సింగరేణి కంపెనీ స్థాయి సాంస్కృతిక పోటీలలో భాగంగా లైట్ సాంగ్ విభాగంలో దార సుశీల, మౌతార్గన్ విభాగంలో ఆదిల్ మహమ్మద్, కవాలి టీమ్ విభాగంలో సాన జలపతి, పులియాల సతీశ్‌కుమార్, పొన్నాల శంకర్, నోవా శ్యామ్, కనకం రమణయ్య, రాకేశ్, రాజారామ్, ప్రేమ్ కుమార్ ప్రతిభ కనబరిచి కోల్ఇండియా స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. వీరికి స్థానిక సీఈఆర్ క్లబ్ఆవరణలో జరిగిన కార్యక్రమంలో సీనియర్ కళాకారులు, ఏఐటీయూసీ సెంట్రల్సెక్రటరీ కవ్వంపల్లి స్వామి, సూపర్‌వైజర్ రమేశ్, కాసిపాక రాజమౌళి ఆత్మీయ వీడ్కోలు పలికారు.
