హైదరాబాద్, వెలుగు: సింగరేణి కాలరీస్ మాజీ సీఎండీ ఎన్. బలరామ్ సంస్థకు అందించిన విశేష సేవలను గుర్తిస్తూ ‘సింగరేణి ఎంప్లాయీస్ అండ్ సిటిజన్స్ ఫోరం’ సభ్యులు ఆదివారం ఆయనకు ఘనంగా సన్మానం, వీడ్కోలు సమావేశం నిర్వహించారు.
బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్ ఆడిటోరియంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొని బలరామ్ హయాంలో సింగరేణి సాధించిన ప్రగతిని కొనియాడారు. ఈ సందర్భంగా పర్యావరణ పరిరక్షణ కోసం బలరామ్ చేసిన కృషిని వివరిస్తూ రచించిన ప్రత్యేక పుస్తకాన్ని అతిథులు ఆవిష్కరించారు.
వృత్తిపరమైన బాధ్యతలతో పాటు సామాజిక, పర్యావరణ స్పృహతో ఆయన చేసిన సేవలు ఆదర్శనీయమని వక్తలు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కాకి మాధవరావు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు జేబీ.
రాజు, జీడీ అరుణ, రిటైర్డ్ ఐఆర్‌టీఎస్ అధికారి భరత్ భూషణ్, మాజీ మంత్రి రవీంద్ర నాయక్, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, సేవాలాల్ సేన జాతీయ అధ్యక్షుడు భూక్య సంజీవ్ నాయక్, డీఎస్పీ రాధ, సింగరేణి ఎంప్లాయీస్ అండ్ సిటిజన్స్ ఫోరం నాయకులు గోళ్ల రమేశ్, భూక్యా కృష్ణమూర్తి, పులి మోహన్ తదితరులు పాల్గొన్నారు.
