కార్మికుల సహజ మరణానికి రూ.10 లక్షల బీమా : సీఎండీ బుద్ద ప్రకాశ్

కార్మికుల సహజ మరణానికి రూ.10 లక్షల బీమా : సీఎండీ బుద్ద ప్రకాశ్
  • ప్రకటించిన సీఎండీ బుద్ద ప్రకాశ్​ ఏప్రిల్ 1 నుంచి ఉచిత బీమా అమలు

హైదరాబాద్, వెలుగు: సింగరేణి కార్మికులు సహజంగా మరణించినా వారి కుటుంబానికి రూ.10 లక్షల ఉచిత బీమా అందించనున్నట్లుగా ఆ సంస్థ సీఎండీ బుద్ద ప్రకాశ్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇప్పటివరకు సింగరేణి కార్మికులకు కోటి రూపాయల ప్రమాద బీమా పథకాన్ని అమలు చేస్తున్న యూనియన్ బ్యాంక్.. సింగరేణి యాజమాన్యం సూచనల మేరకు సహజ మరణానికి కూడా ఉచిత బీమా సౌకర్యాన్ని కల్పిస్తూ నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు. 

యూనియన్ బ్యాంకులో కార్పొరేట్ శాలరీ అకౌంట్ కలిగి ఉన్న కార్మికులు, అధికారులు ఎవరైనా సరే మృతి చెందితే వారి కుటుంబాలకు రూ.10 లక్షల బీమా చెక్కు అందజేస్తామని తెలిపారు. ఏప్రిల్ ఒకటి నుంచి ఈ పథకం అమలులోకి వస్తుందని వెల్లడించారు.