సింగరేణిలో 113 మంది ఆఫీసర్ల బదిలీలు

సింగరేణిలో 113 మంది ఆఫీసర్ల బదిలీలు

కోల్​బెల్ట్​,వెలుగు:   సింగరేణి వ్యాప్తంగా పలువురు మైనింగ్‌‌, మెడికల్‌‌, పర్సనల్‌‌ విభాగాల అధికారులను బదిలీ చేస్తూ యాజమాన్యం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. వివిధ హోదాల్లో పనిచేస్తున్న 113 మంది మైనింగ్‌‌ ఆఫీసర్లను బదిలీ చేసింది. 

వీరిలో డీజీఎంలు, మేనేజర్లు, అసిస్టెంట్‌‌ మేనేజర్లు, అండర్‌‌ మేనేజర్లు, సీనియర్‌‌ మేనేజర్లు ఉన్నారు. పర్సనల్‌‌ విభాగంలో డీజీఎం నుంచి పర్సనల్‌‌ మేనేజర్‌‌, డిప్యూటీ పర్సనల్‌‌ మేనేజర్‌‌ (డీవైపీఎం), సీనియర్‌‌ పర్సనల్‌‌ ఆఫీసర్‌‌ (పీవో) స్థాయి వరకు 30 మంది అధికారులను బదిలీ చేసింది. మెడికల్‌‌ విభాగంలోనూ పలువురు వైద్యులను బదిలీ చేశారు.