
కోల్బెల్ట్, వెలుగు: కార్మకులు, వారి కుటుంబాల సంక్షేమానికి యాజమాన్యం ప్రయారిటీ ఇస్తోందని సింగరేణి కార్పొరేట్ జీఎం(సివిల్) టి.సూర్యనారాయణ అన్నారు. గురువారం ఆయన మందమర్రి ఏరియాను సందర్శించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. కార్మికవాడల్లో చేపట్టిన అభివృద్ధి పనులను సత్వరం పూర్తిచేయాలన్నారు. సూర్యనారాయణ ఈనెలఖారున పదవీ విరమణ పొందనున్న నేపథ్యంలో జీఎం ఆఫీస్, ఇల్లెందు క్లబ్లో జీఎం జి.దేవేందర్, ఆఫీసర్లు, సివిల్కాంట్రాక్టర్లు ఆయనను వేర్వేరుగా సన్మానించారు.
కార్యక్రమంలో ఏరియా ఏస్వోటుజీఎం విజయప్రసాద్, ఏరియా ఇంజనీర్వెంకటరమణ, శాంతిఖని గ్రూప్ ఏజెంట్ఖాదిర్, పర్సనల్మేనేజర్ శ్యాంసుందర్, డీజీఎం రాజన్న, సివిల్ఎస్ఈలు రాము, జయప్రకాశ్, డీవైఎస్ఈ శ్రీధర్, జేఈ దేవికుమార్, మందమర్రి సివిల్ కాంట్రాక్టర్ అసోసియేషన్ అధ్యక్షుడు నాగమల్లేశ్, ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్, కోశాధికారి సీహెచ్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.