కోయగూడెం ఓసీలో పర్యటించిన సింగరేణి డైరెక్టర్

కోయగూడెం ఓసీలో పర్యటించిన సింగరేణి డైరెక్టర్

టేకులపల్లి, వెలుగు: సింగరేణి డైరెక్టర్ కే. వెంకటేశ్వర్లు ఆదివారం కోయగూడెం ఓసీలో పర్యటించారు.  కేఓసీ వ్యూపాయింట్ నుంచి పని స్థలాలకు వెళ్లారు.  రోజు వారి బొగ్గు ఉత్పత్తి, రవాణా, ఓబీ బ్లాస్టింగ్, లోడింగ్ పనులను, భద్రతా చర్యలు, యంత్రాల పనితీరు తదితర అంశాలపై అధికారులతో  సమీక్ష నిర్వహించారు. పనులను నాణ్యతతో పాటు భద్రతా ప్రమాణాలను పాటిస్తూ ముందుకు తీసుకెళ్లాలని అన్నారు. బొగ్గు నాణ్యత సామర్థ్యం పెంచే జి.13 బొగ్గు ఉత్పతి అయ్యే లాగా చూడాలని, ఉపరితల గనుల్లో ఉద్యోగులకు రక్షణ పరమైన జాగ్రత్తలు, రక్షణతో కూడిన బొగ్గు ఉత్పత్తి తీయాలని అన్నారు. 

ఈ కార్యక్రమంలో ఇల్లందు ఏరియా జిఎం వి. కృష్ణయ్య, కోయగూడెం ప్రాజెక్టు అధికారి గోవిందరావు, జేకే ఓసీ పీఓ జాకీర్ హుస్సేన్, డీజీఎం  (సివిల్) రవి కుమార్, డీజీఎం  (ఏరియా వర్క్ షాప్) నాగరాజు నాయక్, కేఓసీ  మేనేజర్ శ్రీనివాసరావు, క్వాలిటీ మేనేజర్ రామదాసు, సెక్యూరిటీ అధికారి అంజి రెడ్డి, తదితర అధికారులు, ఉద్యుగులు పాల్గొన్నారు.