లాభాలపై తప్పుడు లెక్కలు చూపించి మోసం చేసిన్రు

లాభాలపై తప్పుడు లెక్కలు చూపించి మోసం చేసిన్రు

భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు: సింగరేణి యాజమాన్యం 2021–22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి లాభాలపై తప్పుడు లెక్కలు చూపి కార్మికులను మోసం చేసిందని సింగరేణి కాలరీస్​ వర్కర్స్​ యూనియన్​ అదనపు ప్రధాన కార్యదర్శి మిర్యాల రంగయ్య ఆరోపించారు. కొత్తగూడెం ఏరియాలోని జీకే ఓసీ, పీవీకే – 5 ఇంక్లైన్​ మైన్​ల ఆవరణలో మంగళవారం గేట్​మీటింగ్​ నిర్వహించారు. 2021–22 ఆర్థిక సంవత్సరంలో రూ.1,600 కోట్ల లాభం రాగా యాజమాన్యం రూ. 1,227 కోట్లు మాత్రమే చూపించి కార్మికులకు అన్యాయం చేసిందన్నారు.

లాభాలు సరిగా చూపించకపోవడంతో కార్మికులకు లాభాల్లో వాటా తగ్గిందని ఆరోపించారు. అప్పులపై వడ్డీ మాఫీ చేసి సంస్థను ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టేందుకు యాజమాన్యం కుట్ర పన్నుతోందని విమర్శించారు. యూనియన్​ సలహాదారు దమ్మాలపాటి శేషయ్య, నాయకులు వంగా వెంకట్, జి. వీరస్వామి, ఎం రవి. నాగేశ్వరరావు, సుధాకర్, చంద్రయ్య, గుత్తుల సత్యనారాయణ పాల్గొన్నారు.