V6 News

కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో సింగరేణి ఆవిర్భావ వేడుకలు

కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో సింగరేణి ఆవిర్భావ వేడుకలు

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : కొత్తగూడెంలోని ప్రకాశం స్టేడియంలో సింగరేణి ఆవిర్భావ వేడుకలను ఈ నెల 23న ఘనంగా నిర్వహించనున్నట్టు సింగరేణి జీఎం వెల్ఫేర్​ జీవి కిరణ్​ కుమార్​ తెలిపారు. ఏర్పాట్లపై కొత్తగూడెంలోని సింగరేణి హెడ్డాఫీస్​లో గురువారం నిర్వహించిన రివ్యూ మీటింగ్​లో ఆయన మాట్లాడారు. హెడ్డాఫీస్​తో పాటు అన్ని ఏరియాల్లో ఆఫీసులను విద్యుత్​ లైట్లతో అలంకరించాలన్నారు.

 స్టేడియంలో ప్రగతి స్టాల్స్​ ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఆవిర్భావ వేడుకల్లో కార్మికులు, కార్మిక కుటుంబాలు, పరిసర ప్రాంతాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సింగరేణి ఆఫీసర్లు బి. సీతారామమ్, ఎం. ఉష, మురళీ ధరరావు, ముకుంద సత్యనారాయణ, వరప్రసాద్, శాస్త్రి, రాజశేఖర్​, రాజ్​ కుమార్, జాకీర్​ హుస్సేన్​ పాల్గొన్నారు.