లక్ష్యాలు సాధిస్తేనే సింగరేణికి ఉజ్వల భవిష్యత్ : మందమర్రి ఏరియా జీఎం ఎన్.రాధాకృష్ణ

లక్ష్యాలు సాధిస్తేనే సింగరేణికి ఉజ్వల భవిష్యత్ :  మందమర్రి ఏరియా జీఎం ఎన్.రాధాకృష్ణ

కోల్​బెల్ట్, వెలుగు: బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదకత, రవాణా లక్ష్యాలు సాధిస్తేనే సింగరేణికి ఉజ్వల భవిష్యత్ ఉంటుందని మందమర్రి ఏరియా జీఎం ఎన్.రాధాకృష్ణ అన్నారు. గురువారం జీఎం ఆఫీస్​లో విలేకర్లు, యూనియన్లతో వేర్వేరుగా నిర్వహించిన సమావేశాల్లో మల్టీ డిపార్ట్​మెంట్​కమిటీల పర్యటనపై మాట్లాడారు. బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదకతను మెరుగుపర్చాలనే లక్ష్యంతో అన్ని బొగ్గు గనులపై మల్టీ డిపార్ట్​మెంట్​కమిటీలు పర్యటించనున్నట్లు చెప్పారు. 

సంస్థ స్థితిగతులు, గనులు ఉత్పత్తి లక్ష్యాలు, ఉత్పాదకతను పెంచడం, రవాణా, భారీ యంత్రాలను వినియోగించడం, ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించడం, కార్మికుల సంక్షేమం.. అంశాలపై సంస్థ చర్యలను కార్మికులకు వివరించనున్నట్టు తెలిపారు. మల్టీ డిపార్ట్​మెంట్​కమిటీలు ఈనెల 18 నుంచి 23 వరకు అన్ని గనులపై పర్యటించనున్నట్లు చెప్పారు.