ఉద్యోగుల పిల్లలకు సింగరేణి చేయూత

ఉద్యోగుల పిల్లలకు సింగరేణి చేయూత

హైదరాబాద్, వెలుగు: సింగరేణి ఉద్యోగుల పిల్లల చదువుల కోసం ప్రవేశపెట్టిన మెరిట్ స్కాలర్ షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ స్కీమ్లతో అనేక మంది లబ్ధి పొందుతున్నారని జనరల్ మేనేజర్ సురేశ్ వెల్లడించారు. బుధవారం ఆయన హైదరాబాద్ సింగరేణి భవన్ పరేజ్ విభాగంలో ఉద్యోగం చేస్తున్న శ్రీలక్ష్మికి.. ఆమె కొడుకు ఐఐటీ చదువు కోసం . మంజూరైన రూ. లక్ష రీయింబర్స్మెంట్ చెక్కును అందజేశారు. సీఎం హామీ మేరకు సంస్థ సీఎండీ శ్రీధర్ ఆదేశాలతో ఐదేళ్ల కిందరీయింబర్స్మెంట్ పథకాన్ని ప్రారంభించామని సురేశ్ తెలిపారు. ఐఐటీ, ఐఐఎం వంటి సంస్థల్లో చదువుకునే సింగరేణి ఉద్యోగులపిల్లలకు రూ. 8 ముంచి రూ.10 లక్షల వరకుట్యూషన్ ఫీజును సంస్థ భరిస్తున్నదని వెల్లడించారు. ఈ స్కీమ్ ద్వారా ఇప్పటివరకు ఐఐటీల్లో 27 మంది, ఐఐఎంలలో చదువుతున్న 9 మంది, మెరిట్ స్కాలర్ షిప్ ల ద్వారా 150 మంది లబ్ధి పొందారన్నారు