
గోదావరిఖని, వెలుగు : సింగరేణిలో మెడికల్ బోర్డు ఉందో.. లేదోనని కార్మికులు, డిపెండెంట్లు ఆందోళన చెందుతున్నారని టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి పేర్కొన్నారు. వెంటనే మెడికల్ బోర్డును యాజమాన్యం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. బుధవారం గోదావరిఖని ప్రెస్‌క్లబ్‌లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఆరు నెలలుగా మెడికల్ బోర్డు ఏర్పాటు చేయకపోవడంతో కారుణ్య నియామకాలు ఉంటాయా.. లేదోననే సందేహాలు కార్మికుల్లో తలెత్తాయన్నారు. గత మార్చి నిర్వహించి 55 మందిని పిలిచి, ఐదుగురినే అన్ ఫిట్ చేయడంతో కారుణ్య నియామకాలపై కార్మికుల్లో అభద్రత నెలకొందన్నారు. మెడికల్ ఇన్వాలిడేషన్ అయిన10 మంది కార్మికుల పిల్లలను విజిలెన్స్ పేరుత0, నేమ్ రిమూవల్ అయిన వారిని కూడా ఇబ్బందులకు గురి చేస్తూ ఇంటర్వ్యూలు నిర్వహించకపోవడాన్ని తప్పు పట్టారు.