కోల్‌బెల్ట్, వెలుగు: సింగరేణిలో ఆఫీసర్లను బదిలీ చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. కొత్తగూడెం ఏరియాలోని వీకే ఓసీపీ పీవో అడిషనల్జీఎం శ్రీరమేశ్ను మణుగూరు ఏరియాకు, కొత్తగూడెం ఏరియా కిష్టారం ఓసీపీ అడిషనల్జీఎం వేదాద్రి నర్సింహారావు వీకే ఓసీపీకి బదిలీ అయ్యారు.
భూపాలపల్లి ఏరియా సేఫ్టీ ఆఫీసర్డిప్యూటీ జీఎం గంగా లలితేంద్రప్రసాద్ మందమర్రి ఏరియా కొత్త ఏస్వో టు జీఎంగా నియమిస్తూ, అదనంగా రామకృష్ణాపూర్ ఓసీపీ పీవో బాధ్యతలు అప్పగించింది. రామగుండం–3 ఏరియా ఓసీపీ–1 డీజీఎం రాజశేఖర్‌ను ఓసీపీ–2కు, భూపాలపల్లి ఏరియా గ్రూప్–1ఏఓ డీజీఎం మటూరి రవీందర్ భూపాలపల్లి సేఫ్టీ ఆఫీసర్‌గా, రామగుండం–3 ఎస్ఎంఎస్ప్లాంట్ డీజీఎం ప్రవీణ్‌వి పాటింగ్‌ను రామగుండం –3 ఓసీపీ–1కు, మందమర్రి ఏరియా ఎంవీటీసీ డీజీఎం జి.శంకర్‌ను రామగుండం –3 ఏరియా సేఫ్టీ ఆఫీసర్‌గా, కార్పొరేట్ ఆర్అండీ డీజీఎం సునీల్వర్మను సత్తుపల్లి ఏరియా కిష్టారం ఓసీ పీవోగా, భూపాలపల్లి ఏరియా కేటీకే –1 గని డీజీఎం తిరుపతిని అదే ఏరియాలోని గ్రూప్-–1 ఏఓగా, కార్పొరేట్పర్చేజ్ డీజీఎం మురళిని కార్పొరేట్ ఆర్అండ్డీ వింగ్‌కు ట్రాన్స్ ఫర్ అయ్యారు.
భూపాలపల్లి ఏరియా కేటీకే ఓసీపీ –3 అడిషనల్ మేనేజర్ మధుసూదన్‌ను బెల్లంపల్లి రీజియన్ ఎంవీటీసీకి, రామగుండం –2 ఏరియా ఎన్విరాన్మెంట్ సెల్ అడిషనల్ మేనేజర్సురేశ్బాబును ఆర్జీ –2 ఎంవీటీసీకి, రామగుండం –2 ఏరియా ఓసీపీ –3 అడిషనల్ మేనేజర్ శ్రీధర్‌ను మందమర్రి ఏరియా ఎంవీటీసీకి, మణుగూరు ఏరియా ఎంఓసీ అడిషనల్మేనేజర్అనిల్కుమార్ను కొత్తగూడెం వీకే ఓసీపీకి, కొత్తగూడెం ఏరియా పీవీకే –5 గని డిప్యూటీ మేనేజర్ భరత్చంద్రను కొత్తగూడెం వీకే ఓసీపీకి, రామగుండం –2 ఓసీపీ –3 ఎస్ఈ వేణుకుమార్‌ను ఆర్జీ –2 ఏరియా ఎన్విరాన్మెంట్సెల్కు, అడ్రియాల ప్రాజెక్ట్ సీనియర్ అండర్ మేనేజర్ వివేకానందను మణుగూరు ఏరియా కొండపూరం మైన్‌కు,కొత్తగూడెం ఏరియా పీవీకే- –5 గని మైనింగ్ట్రైనీ రమ్యశ్రీని కొత్తగూడెం వీకే ఓసీపీకి బదిలీ చేస్తూ సింగరేణి జీఎం(పర్సనల్,ఈఈ అండ్ఆర్సీ) మురళీధర్ ఉత్తర్వులు జారీ చేశారు.
