భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు : సింగరేణి వ్యాప్తంగా ఇప్పటి వరకు 16,790 హెక్టార్లలో 6.68 కోట్ల మొక్కలు నాటామని సింగరేణి కాలరీస్ కంపెనీ డైరెక్టర్లు ఎల్వీ.సూర్యనారాయణ, కొప్పుల వెంకటేశ్వర్లు, ఎం.తిరుమలరావు తెలిపారు. శుక్రవారం కొత్తగూడెంలోని సింగరేణి బంగ్లోస్ ఏరియా సింగరేణి ఆధ్వర్యంలో మొక్కలను నాటారు. అనంతరం సింగరేణి హెడ్డాఫీస్లో ఏర్పాటు చేసిన ప్రోగ్రాంలో వారు మాట్లాడారు.
గాలి, నీరు, భూమి కాలుష్యం కాకుండా కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. కాలుష్యాన్ని తగ్గించే క్రమంలో సోలార్ విద్యుత్‌కు సింగరేణి ప్రాధాన్యత ఇస్తోందన్నారు. అనంతరం మినిస్ట్రీ ఆఫ్ కోల్ నిర్వహించిన స్టార్ రేటింగ్‌లో ఫైవ్ స్టార్ రేటింగ్ కలిగి పర్యావరణ విభాగంలో అత్యుత్తమ ప్రతిభ కనపర్చిన ఖైరిగూడ ఓపెన్‌కాస్టు, రవీంద్రఖని న్యూటెక్ అండర్ గ్రౌండ్ మైన్‌కు ఉత్తమ ఎకో ఫ్రెండ్లీ మైన్ అవార్డులను డైరెక్టర్లు అందజేశారు.
