28 ఏళ్లుగా పెన్షన్ పెంచడం లేదు : సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వెంకటయ్య

28 ఏళ్లుగా పెన్షన్ పెంచడం లేదు :  సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయీస్  అసోసియేషన్ ప్రెసిడెంట్ వెంకటయ్య
  •     సింగరేణి రిటైర్డ్​ ఎంప్లాయీస్  అసోసియేషన్​ ప్రెసిడెంట్​ వెంకటయ్య

కోల్​బెల్ట్, వెలుగు: 28ఏళ్లుగా పెన్షన్​ పెరగకపోవడంతో బొగ్గు గని రిటైర్డ్​ ఉద్యోగుల కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయని సింగరేణి రిటైర్డు ఎంప్లాయీస్​ అసిసోయేషన్​ జిల్లా ప్రెసిడెంట్​ గజెల్లి వెంటకయ్య అన్నారు. గురువారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని 51వ డివిజన్​ లక్ష్మినగర్​లో సింగరేణి రిటైర్డు ఉద్యోగుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పెన్షన్​ పెంపుదల, ఇతర సమస్యల పరిష్కారానికి  చేపట్టాల్సిన భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. సింగరేణి రిటైర్డు ఉద్యోగుల పెన్షన్​ పెంచాలంటూ పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రంపై ఒత్తిడి తీసుకరావడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. 

పెన్షన్​ పెంపుదలకు ఈ నెల 30న న్యూఢిల్లీలోని జంతరమంతర్​ వద్ద ఆందోళన నిర్వహించే బొగ్గు గనుల పెన్షనర్లుకు మద్దతుగా మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తాలో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. జిల్లాలోని రిటైర్డు ఉద్యోగులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. అసోసియేషన్​ గౌరవ అధ్యక్షుడు రాజన్న, జనరల్​సెక్రటరీ నర్సయ్య, మందమర్రి, శ్రీరాంపూర్, బెల్లంపల్లి ఏరియాల రిటైర్డు ఉద్యోగులు పాల్గొన్నారు.