మందమర్రిలో జీతాలు చెల్లించాలని కాంట్రాక్ట్​ కార్మికుల ధర్నా

మందమర్రిలో జీతాలు చెల్లించాలని కాంట్రాక్ట్​ కార్మికుల ధర్నా

కోల్​బెల్ట్, వెలుగు: జీతాలు చెల్లించాలని డిమాండ్​ చేస్తూ మందమర్రి ఏరియాలోని సులభ్​కాంట్రాక్ట్​ కార్మికులు ధర్నా చేపట్టారు. సింగరేణి సులభ్​వర్కర్స్​ యూనియన్(ఇప్టూ) ఆధ్వర్యంలో మందమర్రి, రామకృష్ణాపూర్, బెల్లంపల్లి ప్రాంతాల కాంట్రాక్ట్​ కార్మికులు బుధవారం మందమర్రి ఏరియా సింగరేణి జీఎం ఆఫీస్​ఎదుట ఆందోళనకు దిగారు. ర్యాలీగా వచ్చి పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని . సింగరేణి ఆఫీసర్లకు అందజేశారు. ధర్నాలో లీడర్లు మాట్లాడుతూ.. సింగరేణి సంస్థలో పనిచేస్తున్న తమకు యాజమాన్యం సక్రమంగా వేతనాలు చెల్లించడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికీ ఏప్రిల్​నెల జీతం రాలేదన్నారు.

వేతనాలు టైమ్​కు రాకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు పడుతున్నామన్నారు. ఇప్పటికైనా యాజమాన్యం జీతాలు రిలీజ్​చేయాలని డిమాండ్​ చేశారు. వారు ధర్నా చేస్తున్న సమయంలో వర్షం పడగా దాన్ని లెక్కచేయకుండా ఆందోళన కొనసాగించారు. ఇప్టూ రీజియన్ ప్రెసిడెంట్ ఎండీ జఫర్, సెక్రటరీ టి.శ్రీనివాస్, లీడర్లు ఎం.సురేందర్, అజయ్, కనుకయ్య, మల్లేశ్, వెంకటి తదితరులు పాల్గొన్నారు.