సారంగ దరియా పాటపై అభ్యంతరం లేదన్న కోమలి

V6 Velugu Posted on Mar 17, 2021

లవ్ స్టోరీ మూవీలోని సారంగ దరియా సాంగ్ పై వివాదం ముగిసింది. సినిమాలో పాట వాడటం వల్ల తనకెలాంటి అభ్యంతరం లేదన్నారు జానపద సింగర్ కోమలి. డైరెక్టర్ శేఖర్ కమ్ములను కలిసిన కోమలి...సారంగ దరియా పాట లవ్ స్టోరి సినిమాలో తనతో పాడించలేదనే బాధ ఉండేదని.. అదే ఆరాటాన్ని కొన్ని మీడియాల ద్వారా చెప్పానన్నారు. శేఖర్ కమ్ముల తన రాబోయో సినిమాల్లో అవకాశం ఉంటే తనతో పాట పాడిస్తానని మాటిచ్చారన్నారు. అలాగే 'లవ్ స్టోరి' సినిమా ఆడియో రిలీజ్ కార్యక్రమంలో స్టేజీ మీద 'సారంగ దరియా' పాట తనతోనే పాడిస్తానన్నారు.  ఇన్ని రోజులు కమ్యునికేషన్ సమస్య వల్ల గాయని కోమలి గారిని కలవలేకపోయానన్నారు శేఖర్ కమ్ముల. భవిష్యత్ లో తన సినిమాలో జానపద పాట పాడించే అవకాశం ఉంటే తప్పకుండా కోమలితో పాడిస్తానన్నారు. తాను సోషల్ మీడియా ద్వారా చేసిన ప్రామిస్ లను నిలబెట్టుకుంటానని చెప్పారు. 

Tagged Song, objection

Latest Videos

Subscribe Now

More News