ఆ కారణంగా ఇప్పటికీ అద్దె ఇంట్లోనే.. సింగర్ కౌసల్య కామెంట్స్ వైరల్

ఆ కారణంగా ఇప్పటికీ అద్దె ఇంట్లోనే.. సింగర్ కౌసల్య కామెంట్స్ వైరల్

సింగర్ కౌసల్య(Singer Kausalya).. తన మధురమైన గొంతుతో లక్షలాది మంది అభిమానులతో సంపాదించుకున్నారు ఈ గాయని. సంగీత దర్శకుడు చక్రి స్వరకల్పనలో ఆమె ఎక్కువ పాటలు పాడారు. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన దాదాపు అన్ని పాటలు సూపర్ హిట్స్ గా నిలిచాయి. ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, గోపి గోపిక గోదావరి, ఇడియట్ ఇలా చాలా సినిమాల్లో అద్భుతమైన పాటలు పాడారు కౌసల్య. అయితే.. సంగీత దర్శకుడు చక్రి మరణం తరువాత ఆమెకు అవకాశాలు బాగా తగ్గాయి. అందుకే ఆమె కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లోపే గురించి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు.

ఒక గాయనిగా నా ప్రయాణం మొదలైన నుండి మంచి సంపాదన వచ్చింది కానీ.. ఆ డబ్బును ఎలా దాచుకోవాలో, ఎక్కడ పెట్టుబడి పెట్టాలో తెలిసేది కాదు. ఆ సమయంలో నాకు అంత ఆలోచన కూడా లేదు. అందుకే.. ఇప్పటికీ అద్దె ఇంట్లోనే ఉంటున్నాను. జీవితం ఎప్పుడూ మనకు పాఠాలను నేర్పిస్తూనే ఉంటుంది. ఎవరైనా సరే డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే.. నేను అది అనుభవించాను. ఒకానొక సమయంలో ఆఫర్లు లేక చాలా ఇబ్బందులు పడ్డాను. ఆ తరువాత కొంతకాలానికి నేను మ్యూజిక్ అకాడమి ఏర్పాటు చేసుకున్నాను. నేను సంగీతంలోనే ఉండాలనుకున్నాను.. ఉంటున్నాను.. అందుకు నాకు ఆనందంగా ఉంది.. అని చెప్పుకొచ్చాడు సింగర్ కౌసల్య.